అహ్మదాబాద్: ఇష్రత్ జహాన్ బూటకపు ఎన్‌కౌంటర్ కేసులో సీబీఐ అధికారులు గుజరాత్‌కు చెందిన ఐపీఎన్ అధికారి జీఎల్ సింఘాల్‌ను అరెస్టు చేశారు. 2004 జూన్‌లో ఇష్రత్ జహాన్ అనే యువతితో పాటు మరో ముగ్గురు యువకులు అహ్మదాబాద్ శివారులో హత్యకు గురయ్యారు. వాళ్లు గుజరాత్ సీఎం మోడీ హత్యకు కుట్ర పన్నుతున్న తీవ్రవాదులుగా పోలీసులు ఆరోపించారు. సింఘాల్ ఆ సమయంలో అసిస్టెంట్ కమిషనర్‌గా ఉన్నారు.




