Wednesday, 4 November 2026

గుట్కాల బహిరంగ విక్రయానికి వ్యవస్థలో లోపాలే కారణం రాష్ట్ర మహిళా

కమిషన్‌ ఛైర్మన్‌ త్రిపురాన

హైదరాబాద్‌ : నిషేధించిన గుట్కాలు బహిరంగ మార్కెట్లో లభ్యమవడానికి వ్యవస్థలో లోపాలే కారణమని రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్మన్‌ త్రిపురాన వెంకటరత్నం అభిప్రాయపడ్డారు. అప్కా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘గుట్కాల నిషేదం-పౌర సంస్థ పాత్ర’ అనే అంశంపై జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఏ కిల్లీ కొట్టులో చూసినా గుట్కాలు, పొగాకు ఉత్పత్తులు తోరణాలుగా కట్టి విక్రయిస్తున్నారని చెప్పారు. వీటిని నియంత్రించేందుకు ప్రభుత్వం, పోలీసులే ప్రయత్నించాలనే భావన ప్రజల్లో ఉండటం సరికాదన్నారు. అరోగ్యానికి హాని కల్గించే పదార్థాలను నిషేధించినా, లేకపోయినా వాటిని వాడకపోవడమే ఉత్తమమని ఆమె అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *