సర్పవరం జంక్షన్ : తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలంలోని రమణయ్యపేట, సూర్యారావుపేట గ్రామాల్లో రెండు నూనె పరిశ్రమలపై విజిలెన్స్ అండ్ ఎస్‌ఫోర్స్‌మెంట్ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. అనుమతులు లేకుండా తరలిస్తున్న ట్యాంకర్లను నిలుపుదలచేసి రికార్డులను తనిఖీ చేశారు.పూర్తిస్థాయి అనుమతులు లేకుండా కంపెనీల్లో లావాదేవీలను నిర్వహించడంతో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు విజిలెన్స్ సీఐ సీహెచ్ శ్రీనివాస్‌రావు తెలిపారు. ఈ దాడుల్లో విజిలెన్స్ తహశీల్దారు ఎస్‌వీ సత్యనారాయణ, శివప్రసాద్, లీగల్ మెటరాలజీ ఇన్స్‌పెక్టర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.




