దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి, జడ్పిటిసి పసునూరు సరస్వతమ్మ కొండమల్లేపల్లి జనవరి 19 జనం సాక్షి న్యూస్ :
కొండమల్లేపల్లి మండల కేంద్రం గుమ్మడవల్లి గ్రామంలో గురువారం నాడు కొండమల్లేపల్లి ఎంపీపీ దూదిపాల రేఖ రెడ్డి జెడ్పిటిసి పసునూరు సరస్వతమ్మ కంటి వెలుగు కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగును కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మంగా నిర్వహిస్తున్న రెండో విడత కంటి వెలుగు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ కంటి పరీక్ష జరిగేలా అధికారులు బాధ్యత తీసుకోవాలని ఆయన అన్నారు ఎంతో ముందు చూపుతో పెట్టిన ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని అందరం కలిసి విజయవంతం చేద్దాం అని వారు అన్నారు.గ్రామాల్లో కంటి చూపు సమస్యతో బాధపడే వారి బాధలు తీర్చేందుకు ఎంతో ముందు చూపుతో కంటి వెలుగు అనే ఈ గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారన్నారు.మొదటి కంటి వెలుగు కార్యక్రమం చాలా విజయవంతం అయిందన్నారు.ఈ సారి దానిని మించి రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం విజయవంతం చేయాలని అన్నారు.కంటి వెలుగు నిర్వహించేందుకు గ్రామంలో కావాల్సిన వసతులు దగ్గరుండి కల్పించాలని అన్నారు.గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరినీ పంచాయతీ అధికారులు,నేతలు ఇంటికెళ్లి ఈ కార్యక్రమం దగ్గరకు తీసుకొచ్చి పరీక్షలు చేయాలన్నారు.ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి, కళ్లద్దాలు, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు,మందులను అవసరం అయినా వాళ్ళకి కళ్ళజోడు ఉచితంగా,అలాగే అవసరం అయినా వారికి ఉచితంగా ఆపరేషన్ కూడా చేస్తారని తెలిపారు.ఇంత మంచి కార్యక్రమాన్ని మనం అందరం కలిసి సద్వినియోగం చేసుకోవాలన్నారు.గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ పరీక్ష జరిగేలా అధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు.కంటి వెలుగు క్యాంప్ జరిగే రోజు పంచాయతీ సిబ్బంది అంతా అక్కడే ఉండి ఏర్పాట్లు చూడాలన్నారు ఈ కార్యక్రమంలో కొండమల్లేపల్లి ఎంపీడీవో బాలరాజు రెడ్డి, వైస్ ఎంపీపీ కాసర్ల వెంకటేశ్వర్లు, గుమ్మడవల్లి గ్రామ సర్పంచ్ గుండెబోయిన లింగం యాదవ్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు కేసాని లింగారెడ్డి, జడ్పిటిసి సలహాదారు పసునూరు యుగేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ ముక్కమల్ల రాజలింగం, మాజీ సర్పంచ్ పంగ మల్లయ్య యాదవ్, డాక్టర్ షేక్ రసూల్, డాక్టర్ మహేష్, ఏఎన్ఎం లు శ్రీదేవి, లలిత, సూపర్వైజర్ రాణి, ఆశా వర్కర్ పద్మ, నీలమ్మ, పంగ యాదయ్య, పంగ లాలయ్య, మేరె శ్రీనివాస్, శేఖర్ గౌడ్ మరియు పంగ రామయ్య గ్రామ ప్రజలు అధికారులు తదితరులు పాల్గొన్నారు
గుమ్మడవల్లి గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన కొండమల్లేపల్లి ఎంపీపీ




