Wednesday, 4 November 2026

గుమ్మడవల్లి గ్రామంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు సర్పంచ్ గుండెబోయిన లింగం యాదవ్

 

 

 

 

 

 

 

 

జనవరి 26 (జనంసాక్షి) న్యూస్ : కొండమల్లేపల్లి మండల కేంద్రం గుమ్మడవల్లి గ్రామంలో గురువారం నాడు గ్రామ సర్పంచ్ గుండెబోయిన లింగం యాదవ్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా సర్పంచ్ గుండెబోయిన లింగం యాదవ్ మాట్లాడుతూ 1950 జనవరి 26 నుండి సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించిందని,భారత దేశము లోని అనేకమైన జాతులు మతాలు కలిసి ఒకటిగా జీవించే మానవ సమూహాల కోసమే రాయబడిన రాజ్యాంగం పూర్తిగా అమల్లోకి వచ్చిన రోజు అని అన్నారు.అప్పటినుండి ఈ రోజునుగణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నమన్నారు. భారతదేశ స్వాతంత్ర్యానికి కృషిచేసిన అమర వీరుల త్యాగఫలం కొనియాడుతూ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలోప్రాథమికోన్నతపాఠశాల ప్రధానోపాధ్యాయులు సంజీవ్ కుమార్ ,వెంకట్ రెడ్డి,రెహ్మాన్ ఉప సర్పంచ్ ముక్కమల్ల రాజలింగం, మాజీ సర్పంచులు పంగ మల్లయ్య,బోడ యాదయ్య, అదిరాల రాములు, మాజీ ఉప సర్పంచ్ షేక్ జహంగీర్ వర్కాల సత్యనారాయణ, పంగ లాలయ్య, జహంగీర్ పోస్టల్ డిపార్ట్మెంట్, మేరె శ్రీనివాస్, గిరి రామకృష్ణ, జానచైతన్య యువజన సంఘం సభ్యులు నరసింహ, శంకర్, ఫయాజ్, నాగరాజు, అక్బర్, హస్సేన్, హుస్సేన్, బొడ్డుపల్లి అంజి ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజలు యువత, తదితరులు పాల్గొన్నారు