గుమ్మడికాయ గింజలు ఆరోగ్య ప్రయోజనాలు

గుమ్మడికాయ ఎంత పెద్దగా ఉంటుందో గుమ్మడికాయ గింజలలో కూడా అంతే పెద్ద మొత్తంలో విటమిన్లు మినరల్ లభిస్తాయి. గుమ్మడికాయ యొక్క చిన్న విత్తనాలు క్యాన్సర్ ,అధిక రక్తపోటు వంటి తీవ్రమైన సమస్యలను నయం చేయడానికి అద్భుతంగా పనిచేస్తాయి. వివిధ వ్యాధులకు గుమ్మడికాయ గింజల యొక్క ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.

గుమ్మడికాయ గింజల్లో విటమిన్ ఎ,విటమిన్ బి,విటమిన్ K,మరియు విత్తనాల్లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, బీటా-కెరోటిన్ , భాస్వరం, మెగ్నీషియం, రాగి, ఇనుము, పొటాషియం వంటి విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి ,ఇది రోగనిరోధక వ్యవస్థ బ్యాక్టీరియా మరియు వైరస్‌లతో పోరాడటానికి సహాయపడుతుంది.

గుమ్మడికాయ గింజల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది, ఇది సమర్థవంతమైన యాంటీ ఆక్సిడెంట్ కలిగి ఉండి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు చర్మం, జుట్టు సౌందర్యాన్ని పెంచుతుంది అదనంగా, గుమ్మడికాయ గింజలలో ఫైబర్ కూడా పుష్కలంగా లభిస్తుంది.

గుమ్మడికాయ గింజలు తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒక నివేదిక ప్రకారం, గుమ్మడికాయ గింజలలో ఫైబర్ ఎక్కువగా ఉండడంవల్ల గుమ్మడికాయ తినేవారిలో గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువగా రావటంలేదు అన్ని తేలింది అలాగే శరీరంలో ఉండే అదనపు కొవ్వును తగ్గించి హృదయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

గుమ్మడికాయ గింజలలో మెగ్నీషియం పుష్కలంగా లభిస్తుంది రోజుకి 100 గా గుమ్మడికాయ గింజలు తింటే మంచి నిద్ర పడుతుంది అలాగే గుమ్మడికాయ గింజల్లో విటమిన్-సి కూడా అధికంగా ఉండడం వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్‌కు రాకుండా చేస్తోంది విటమిన్-సి అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని 9 శాతం తగ్గిస్తుంది.

కాల్షియం లోపం వలన బోలు ఎముకల వంటి వ్యాధులకు దారితీస్తుంది అదనంగా, శరీరంలో తగినంత కాల్షియం లేకపోతే ఎముక పగుళ్లు కూడా వస్తాయి గుమ్మడికాయ గింజలలో కాల్షియం మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది ఇవి ఎముకలను నిర్మించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. గుమ్మడికాయ గింజలు తినడం వల్ల మన శరీరానికి కావలసిన కాల్షియం నీ అందించి ఎముకలని బలంగా చేస్తోంది

ఒక అధ్యయనం ప్రకారం, గుమ్మడికాయ విత్తనాలలో ఉండే భాస్వరం మూత్రాశయ రాళ్లను కరిగిస్తుంది గుమ్మడికాయ గింజలతో తయారు చేసిన ఆహారాలు (సప్లిమెంట్) ఎక్కువ రోజులు తీసుకుంటే మూత్రాశయంలో ఉండే రాళ్లను కరిగిస్తుంది

అలాగే గుమ్మడికాయ గింజలు తినడం వల్ల రొమ్ము క్యాన్సర్ ,రక్తపోటువాటి సమస్యలు రావు మరియు ఇందులో ఫేబర్ ఎక్కువగా వుండడం వల్ల ఆకలి తక్కువ వేసి శరీర బరువు ని తగిస్తుంది

తాజావార్తలు