Thursday, 5 November 2026

మెదక్ జిల్లా ఉమ్మడి.మండలం. చేగుంట మాసాయిపేట మండలంచెందిన పోతనశెట్టిపల్లిలో గ్రామంలో అగ్ర కులానికి చెందిన పెంటా రెడ్డి బాగోతం ఇప్పటికీ మారలేదు

 

 

 

 

 

 

 

జనం సాక్షి చేగుంట12దళితుల పోచమ్మ గుడినీ తో.పాటు. దారిని కబ్జా చేసుకున్నా కాంగ్రెస్ పార్టీ మండల మండల అధ్యక్షుడు.పెంటారెడ్డి బాగోతందళితులతో సంబంధం లేకుండా మూడుసంవత్సరాల నుంచి అగ్రకులాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పెంటా రెడ్డి దళితుల దేవాలయం పోచమ్మ గుడిని సందర్శించడానికి వెళ్లే దారిని కబ్జా చేసుకుని చుట్టూ కంచి వేసినట్లు దళితులు పోచమ్మ భక్తులు తెలిపారు అగ్రకులాలకు వత్తాసు పలుకుతున్న దళితుడైన సర్పంచ్ నెల్లూరు మీడియాతో అబద్ధాలు తెలుపుతున్నట్లు బాధితులు ఆరోపించారు అదేవిధంగా గ్రామ పెద్దలుగా ఉన్న గ్రామ సర్పంచ్ దళితుడైన నెల్లూరు గ్రామ ఉపసర్పంచ్ గా ఉన్న నాగిరెడ్డి మూడు సంవత్సరాల నుంచి ఎస్సీ మాదిగ దళితులతో సంబంధం లేకుండా పోయినాయి ఎలాంటి సమాచారం బయటపడనీయకుండా బయట గ్రామాలతో గ్రామంలో అందరూ మంచిగున్నము అని అబద్ధాలు పలుకుతూ రాజకీయాలు నడిపిస్తున్నారు అదేవిధంగా ప్రభుత్వపరంగా వారి స్వార్థం కొరకు చేస్తున్నారని వారి వలన మాకు ఎలాంటి ఉపయోగం లేదని గ్రామ దళితులు పేర్కొన్నారు వెంటనే పోతన శెట్టిపల్లి గ్రామంలో పోలీస్ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ ఏర్పాటు చేసి గ్రామ సర్పంచికి ఉప సర్పంచ్ కి నియమ నిబంధనలు తెలియపరచాలని పోలీసులు చొరవ చూపాలని ప్రజా సంఘాలు పేర్కొన్నారు అదేవిధంగా దళితులకు దారి ఇవ్వకుండా పోచమ్మ గుడిని కబ్జా చేసిన సందర్భంగా పెంటా రెడ్డి పై వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత సంఘాల డిమాండ్ చేస్తున్నాయి