Tuesday, 3 November 2026

గుమ్మడిదల మండల కేంద్రంలో ఘనంగా వైద్య దినోత్సవం

జిన్నారం జులై 1(జనంసాక్షి )సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండలం కేంద్రంలో మైత్రి ఫౌండేషన్ సభ్యులు ఘనంగా వైద్య దినోత్సవాన్ని నిర్వహించారు! గుమ్మడిదల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ మధుకర్ను శాలువతో ఘనంగా సన్మానించారు.మైత్రి ఫౌండేషన్ చైర్మన్ చెన్నంశెట్టి ఉదయ్ కుమార్ మాట్లాడుతూ వైద్యో నారాయణ! హరిహ కరోణ అంచలంచెలుగా విజృంభించినప్పటికీ తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా అంకితభావంతో ప్రజలకు వైద్య సేవలు అందించిన దేవుళ్ళని పేర్కొన్నారు ఈ యొక్క కార్యక్రమంలో వైద్య సిబ్బంది, అనసూయ, ప్రతిభ, శారద, ఫౌండేషన్ సభ్యులు తదిరులు పాల్గొన్నారు.