Tuesday, 3 November 2026

వైద్యో నారాయణ హరి.. – లింగగిరి పిహెచ్ సిలో జాతీయ వైద్యుల దినోత్సవం

హుజూర్ నగర్ జులై 1 (జనంసాక్షి): వైద్యో నారాయణ హరి.. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా మండలంలోని లింగగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల వైద్యాధికారి డాక్టర్ సన ను, ఆరోగ్య సిబ్బంది ఘనంగా సన్మానించడం జరిగింది. శనివారం ఈ సందర్భంగా వైద్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఇందిరాల రామకృష్ణ మాట్లాడుతూ వైద్యుడు భగవంతుడుతో సమానం అని తల్లిదండ్రులు జన్మనిస్తే వారు పునర్జన్మ నిస్తారని, కరోన కష్టకాలంలో వారి ప్రాణాలను పణంగా పెట్టి కోట్లాదిమందిని రక్షించిన వైద్యులను సన్మానించడం సమాజానికి గౌరవప్రదం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది యరగాని హైమవతి, స్టాఫ్ నర్సులు జ్యోతి, స్వాతి, ఫార్మాసిస్ట్ సంతోషి, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.