Wednesday, 4 November 2026

గురుకులలో ఘనంగా గణతంత్ర దినోత్సవం.

 

 

 

 

 

 

 

బెల్లంపల్లి, జనవరి 26, (జనంసాక్షి )బెల్లంపల్లి పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ లో 74వ గణతంత్ర దినోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. ప్రిన్సిపల్ ఐనాల సైదులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థు లకు మిఠాయిలు పంచి పెట్టారు. ప్రత్యేక సమావేశంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రిన్సిపల్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి రక్షణ కల్పిస్తూ సమాన అవకాశాలను సమన్యాయంతో పంపిణీ చేసిన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన ఈరోజు ఎంతో ఉత్కృష్టమైన లక్ష్యంతో ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని రాజ్యాంగ స్ఫూర్తిని నింపుకోవాలని కోరారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ రాజ్ కుమార్, జెవిపి దాసం అజిత, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, పేరెంట్స్ కమిటీ అధ్యక్షుడు దాగం మహేష్, సభ్యులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు