Wednesday, 4 November 2026

బాలికలకు అండగా తపాలా శాఖ

 

 

 

 

 

 

 

 

సూర్యాపేట ప్రతినిధి, ఫిబ్రవరి 11( జనంసాక్షి ): పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా తపాలా శాఖ బాలికల కోసం అనేక పథకాలు అందిస్తుందనిసూర్యాపేట పోస్టల్ సూపరింటెండెంట్ వడ్లమూడి వెంకటేశ్వర్లు అన్నారు.ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, అమృత్ పెక్స్ 2023లో భాగంగా జిల్లా కేంద్రంలోని తపాలా కార్యాలయంలో ఆయన పథకానికి సంబంధిత అంశాలను వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న 6208 పోస్టాఫీసుల్లో30 వేల సుకన్య సమృద్దిఖాతాలు తెరవాలని శాఖ నిర్ణయించినట్లు తెలిపారు.ప్రధాని మోడీ చేతుల మీదుగా ఈనెల 9న అమృత్ పెక్స్ 2023 కార్యక్రమాన్ని ఢిల్లీలో ప్రారంభించినట్లు చెప్పారు.తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున తపాలా శాఖ సిబ్బంది పది సంవత్సరాల లోపు ఆడపిల్లల కోసం అమృత్ పెక్స్ ఖాతాలను తెరవాలని సంకల్పించినట్లు చెప్పారు.సూర్యాపేట పోస్టల్ డివిజన్ పరిధిలో మూడు వేల ఖాతాలు తెరవడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు వెల్లడించారు.దీనికోసం ప్రాథమిక పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో10 ఏళ్లలోపు ఆడపిల్లల తల్లిదండ్రులను సంప్రదించడం కోసం మూడు రోజులుగా పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ ఖాతాకు అత్యధికంగా 7.1 శాతంవడ్డీ రేటు, ఆదాయ పన్ను రాయితీ వంటి సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు.