రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం, మే06(జనంసాక్షి):-యూనివర్సిటీ అనుమతులు పొంధకుందనే 4000 మందిని గురునానక్ యూనివర్సిటీ పేరుతో విద్యార్థుల అడ్మిషన్లు తీసుకొని విద్యార్థుల జీవితాలతో చెలగాటంఆడుతున్న గురునానక్ విద్యా సంస్థల గుర్తింపును వెంటనే రద్దు చేయాలని ఏబీవీపి రాష్ట్ర కార్యదర్శి ఝాన్సి డిమాండ్ చేశారు.ఎబీవీపీ అధ్వర్యంలో ఇబ్రహీంపట్నం నుంచి గురునానక్ విద్యాసంస్థల వరకు ర్యాలీ నిర్వహించి,గేట్ ముందు ధర్నాకు దిగారు.విద్యార్థులను గురునానక్ మోసం చేసిందంటు వారికి విద్యార్థులకు న్యాయం చేయాలని.ధర్నా చేపట్టిన ఏబీవిపి నాయకులను అరెస్ట్ చేస్తుండగా కొందరు గురునానక్ గేట్ దుంకి లోపలికి దూసుకెళ్లగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.ఈ సందర్భంగా ఏబీవీపి రాష్ట్ర కార్యదర్శి ఝాన్సి మాట్లాడుతూ విద్యా ఉద్యోగాల కోసం కోట్లాది తెచ్చుకున్న తెలంగాణాలో విద్య వ్యాపారంగా మర్చడంలో భాగమే ప్రవేట్ యునివర్సిటీల అనుమతులన్నరు.గురునానక్ యూనివర్సిటీ అనుమతులు పోందకుండానే విద్యార్థులను మోసం చేస్తూ అడ్మిషన్లు ఇచ్చిందని,గురునానక్ విద్యా సంస్థల అనుమతులు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.అనుమతి లేకుండా ఉండవలసిన నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం యొక్క ప్రమేయంతో నడుస్తున్న గురునానక్ యూనివర్సిటీ మరియు శ్రీనిధి యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలి.యునివర్సిటీకి సహకరిస్తున్న అధికారుల పైన చర్యలు తీసుకోవాలని అన్నారు యూనివర్సిటీ కి ఉండవలసిన నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రైవేటు యూనివర్సిటీలను రద్దు చేయాలి.
దీనిపైన గవర్నర్ ఎంక్వయిరీ జరిపించి నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన ప్రభుత్వ అధికారులు పెద్దలపైన యూనివర్సిటీ యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలి ని శాంతియుతంగా నిరసన చేపట్టిన ఏబీవీపీ నాయకులను అరెస్టు చేసి అక్రమంగా కేసులు బనాయించడం జరిగింది
ఈ కార్యక్రమంలో స్టేట్ జాయింట్ సెక్రెటరీ పృథ్వి,స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ శ్రీరామ్,రాజు,విభాగ్ కన్వీనర్ సూర్య ప్రకాష్,జిల్లా కన్వీనర్ సాయి చరణ్,స్టేట్ లీగల్ సెల్ కన్వీనర్ హరిప్రసాద్,గ్రేటర్ హైదరాబాద్ జాయింట్ సెక్రటరీ వంగ.సంజీవరెడ్డి,ప్రదీప్,శివకృష్ణ,కళ్యాణి,సిరివెన్నెల,అశోక్,శశిధర్ రెడ్డి,జగదీశ్,సందీప్,మహేందర్,పవన్ తదితర విద్యార్థులు,విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.




