Wednesday, 4 November 2026

యువ సంఘర్షణ సభను ఏప్రదం చేయండి సరూర్ నగర్ లో జరిగే బహిరంగ సభకు ప్రియాంక గాంధీ రాక నిరుద్యోగ యువతీ యువకులు లక్షలాదిగా తరలిరండి మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్

 

 

 

 

వికారాబాద్ రూరల్ మే 06 జనం సాక్షిఈనెల 8న నగరంలో నీ సరూర్ నగర్ స్టేడియంలో జరిగే యువ సంఘర్షణ సభను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు శనివారం ఆయన వికారాబాద్ జిల్లా కేంద్రంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ప్రియాంక గాంధీ పాల్గొని హైదరాబాద్ డిక్లరేషన్ పేరుతో యువతకు భరోసానిద్దాం అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారని తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు లేక అనేక ఇబ్బందులు గురవుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో యువ సంఘర్షణ సభను గడప తలపెట్టామన్నారు హైదరాబాద్ డిక్లరేషన్ పేరుతో యువతను భరోసా ఇద్దాం అనే కార్యక్రమం శ్రీకారం చుట్టిన ప్రియాంక గాంధీ పాల్గొనే కార్యక్రమాన్ని వికారాబాద్ ప్రాంతం నుంచి భారీ స్థాయిలో తరలి రావాలని ఆయన సూచించారు మండల పార్టీ అధ్యక్షులు అనుబంధ సంఘాల అధ్యక్షులు గ్రామ కమిటీ అధ్యక్షుడు గ్రామ అనుబంధ సంఘాలు సమన్వయంతో నిరుద్యోగ యువతీ యువకులను చైతన్యం చేసి సరూర్ నగర్ లో జరిగే ప్రియాంక గాంధీ బహిరంగ సభకు లక్షలాదిగా తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు ప్రియాంక గాంధీ నాయకత్వంలో చత్తీస్గడ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రెండవసారి అధికారంలోకి వచ్చిందని ప్రస్తుతం కర్ణాటక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయం అన్నారు తెలంగాణ రాష్ట్రానికి కూడా ప్రియాంక గాంధీ నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందని ఆయన జోష్యం చెప్పారు స్వర్గీయ ఇందిరా గాంధీ కంటే ధైర్యమున్న నాయకురాలు ప్రియాంక గాంధీ అని ఆమె ఇన్చార్జిగా ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆయన అన్నారు మే 8 న జరిగే బహిరంగ సభకు లక్షలాదిక తరలి రావాలని ఆయన నిరుద్యోగ యువతీ యువకులను పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలోమాజీ మున్సిపల్ చైర్మన్ వి సత్యనారాయణ, పిఎసిఎస్ మాజీ చైర్మన్ కిషన్ నాయక్, అనంత్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, రవీందర్, సాగర్ మన్నె శంకర్, యాదవ్ రఘుపతి రెడ్డి,మరియు మురళి, అసిఫ్, సతీష్ రెడ్డి, సంతోష్ గౌడ్, శ్రీనివాస్ ముదిరాజ్, కిష్టా రెడ్డి,జాఫర్, యువజన కాంగ్రెస్ నాయకుడు చాపల శ్రీనివాస్ ముదిరాజ్ బంధయ్య, రామకృష్ణ రెడ్డి, బాలకృష్ణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు