Wednesday, 4 November 2026

వరి ధాన్యం కొంటున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం దేశానికే వరి ధాన్యం కొనుగోలు సెంటర్లు దిక్సూచి ఎంపీపీ సూచన మెదక్ జిల్లా ఎంపీపీల ఫోరం జిల్లా ఉపాధ్యక్షులు మాసుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొనుగోలు సెంటర్ ప్రారంభం

 

 

 

 

 

 

 

చేగుంట రిపోర్టర్.జనంసాక్షి మే 7మెదక్ జిల్లా చేగుంట మండలం మక్కరాజిపేట్ గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రమును చేగుంట మండలం ఎంపీపీ మాసుల శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐకెపిల ద్వారా సొసైటీల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం సెంటర్ఏర్పాటు చేయడం జరిగింది అని రైతులతో తెలిపారు అదేవిధంగా ప్రతిపక్షాలు మాటలు నమ్మి రైతులు దళారుల మాటలు విని మోసపోవద్దని ఐకెపి కేంద్రాలు మరియు సొసైటీ కేంద్రాల వద్ద రైతులు ధాన్యాన్ని అమ్ముకోవాలని ఎంపీపీ మాసుల శ్రీనివాస్ రైతులకు సూచించారు. అదేవిధంగా మహిళా గ్రూపుల నుండి డబ్బులు తీసుకుని మహిళలు అభివృద్ధి చెందుతున్నారని దీని కారణం మహిళా సమైక్య నుండే దోదపడుతుందని తెలిపారు. ఇల్లు బాగుండాలంటే మహిళలు అభివృద్ధి చెదిరితేనే ఇల్లు బాగుంటుందని తెలిపారు. అనంతరం భారత దేశం అంటే వ్యవసాయ రైతుల దేశం అనుకోవాలని తెలంగాణ రాష్ట్రం భారతదేశానికి దిశా దశ మార్గంగా ఉండాలని మెదక్ జిల్లా ఎంపీపీల ఫోరం జిల్లా ఉపాధ్యక్షులు చేగుంట మండలం ఎంపీపీ మాసుల శ్రీనివాస్ తెలిపారు .అనంతరం తెలంగాణ రాష్ట్రంలో మోచో తుఫాన్ రావడం జరుగుతుంది వాతావరణ శాఖ తెలిపిన గాని టిఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా రైతులు అధర్య పడవద్దని టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు గ్రామీణ ప్రాంతాలలో రైతులకు భరోసా ఇస్తూ వారిని ముందుకు నడిపిస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని ఇతర రాష్ట్రాలు ఆలోచిస్తున్నారు అని సమాచారం వస్తుందని మెదక్ జిల్లా ఎంపీపీల ఫోరం జిల్లా ఉపాధ్యక్షులు చేగుంట మండలం ఎంపీపీ మాసుల శ్రీనివాస్ అన్నారు అనంతరం తెలంగాణ రాష్ట్రంలో గత వారం రోజుల నుండి వర్షాలు పడుతున్నా కానీ కొనుగోలు సెంటర్లో వరి ధాన్యమును కొంటున్న రాష్ట్రం ఏకైక తెలంగాణ రాష్ట్రమే అని ఇతర దేశాలకు మార్గంగా వ్యవసాయంలో రైతుల దగ్గర ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న ముందున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆలోచిస్తున్నారు ఇలాంటి ప్రభుత్వం రైతుల పక్షాన సేవ చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఉండడం మన అదృష్టమని మెదక్ జిల్లా ఎంపీపీల ఫోరం జిల్లా ఉపాధ్యక్షులు మాసుల శ్రీనివాస్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కుమ్మరి శ్రీనివాస్ ఎంపీటీసీ బండి కవిత విశ్వేశ్వర్ ఏపీఎం లక్ష్మీనరసమ్మ ఏఈఓ మాధవి సిసి అంజయ్య నాయక్ సురేష్ రెడ్డి అర్జున్ గ్రామ యువకులు రైతులు మహిళలు తదితరులు పాల్గొన్నారు .