రామాపురంలో ప్రపంచ మృతిక దినోత్సవం
గద్వాల నడిగడ్డ ,డిసెంబర్ 5 (జనం సాక్షి);
ప్రపంచ మృతిక దినోత్సవ సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలోని రామాపురం గ్రామంలో సర్పంచ్ ఆర్.బిసన్న గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రైతులకు నేలను ఎలా సంరక్షించుకోవాలి తర్వాత తరాలవారికి నేల స్వభావం నేలను రక్షించుకోవడంలో మెలకువలను గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తో పాటు మండల రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు జి. వెంకటేశ్వర్ రెడ్డి, వడ్డేపల్లి పిఎసిఎస్ వైస్ చైర్మన్ పి. లక్ష్మి రెడ్డి, రైతు బంధు సమితి మెంబెర్ అర్జున్ గౌడ్, కలుగోట్ల నగేశం, రామాపురం వ్యవసాయ విస్తరణ అధికారి జయ శ్రీ తెలిపారు. అదేవిధంగా మట్టి నమూనాలను రైతుల పొలంలో చూపించడం జరిగిందని ఆమె తెలిపారు.
రామాపురంలో ప్రపంచ మృతిక దినోత్సవం




