వరంగల్ ఈస్ట్, జూన్ 2 (జనం సాక్షి)ప్రతి ఒక్కరు గురువు చెప్పిన మాటలు వింటే ఉన్నత స్థాయి చేరుకుంటారని ఐపీఎస్ ఆఫీసర్ రిత్విక్ అన్నారు. తెలంగాణ దశాబ్ది వేడుకల సందర్భంగా శుక్రవారం శ్రీనివాస్ గురుకుల్ పాఠశాలలో పతాకావిష్కరణకు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కె సాయి రిత్విక్ శ్రీనివాస్ గురుకుల పాఠశాలలో 10వ తరగతి వరకు విద్యనిభ్యసించి యూపీఎస్సీ 2022 లో జాతీయ స్థాయి లో 558 ర్యాంక్ తో ఐపీఎస్ సాధించినందుకు గాను విద్యాబుద్ధులు నేర్పిన ప్రముఖ గణిత గురువులు చిదురాల ఇందిర, శ్రీనివాస్ , చంద్రుడు, విజయ్ , సుందర్ సింగ్, మక్బూల్ , శ్రీనివాసాచార్యులు, నాగేందర్ విద్యార్థిని ఘనంగా అభినందించి ఆశీర్వదించారు. అనంతరం సాయి రిత్విక్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. చిన్ననాటి నుండే దిశా నిర్దేశాన్ని ఏర్పరచుకొని ఆ దిశగా ప్రయత్నిస్తే తప్పకుండా అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారని తెలిపారు .
దానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం మరియు గురువుల ప్రోత్బలం ఎంతో తోడ్పడతాయని తెలిపారు. శ్రీనివాస్ గురుకుల్ పాఠశాల లో 8,9,10 తరగతుల లో నేర్చుకున్న పాఠ్యాంశాలు సివిల్స్ ప్రిపరేషన్ లో ఎంతో ఉపయోగ పడ్డాయని , ఉపాధ్యాయులు చెప్పే ప్రతి అంశాన్ని జాగ్రత్తగా వినాలని , పాఠశాల స్థాయి నుండి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకునిఅకుంఠిత దీక్షతో సన్నదమైతే సులువుగా సివిల్స్ సాధించ వచ్చు అని విద్యార్థులకు సివిల్స్ పైన అవగాహన కల్పించారు.సాయి రుత్వీక్ తో పాటు అతని మిత్రులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకొని గురువులతో ఉన్న అనుబంధాన్ని మరియు మిత్రులతో ఉన్న గత స్మృతులను నెమరు వేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యజమాన్యం చిదురాల సోమరత్నం , యుగంధర్ వినయ్ ,ఉదయ్, విజయ్ అనిల్ , రాజేష్ మరియు విద్యార్థులు పాల్గొని ఈ వేడుకలను విజయవంతంగా నిర్వహించారు.
గురువుల బాటలో నడువాలి




