Tuesday, 3 November 2026

వరంగల్లో రిజిస్ట్రేషన్ కార్యాలయం ఏర్పాటు చేయాలి

వరంగల్ ఈస్ట్, జూన్ 02 (జనం సాక్షి)వరంగల్ జిల్లా భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ వరంగల్ జిల్లా హెడ్ క్వార్టర్స్ లోనే జరగాలని వరంగల్ సామాజిక న్యాయవేదిక ప్రధాన కార్యదర్శి అచ్చ వినోద్ కుమార్ కోరారు. ఆయన శుక్రవారం ఒక సమావేశం ఏర్పాటు చేశారు. వరంగల్, హనుమకొండ రెండు జిల్లాలుగా ఏర్పడిన క్రమంలో ఆర్టిఏ కార్యాలయం వరంగల్లో ఉండేది కానీ వరంగల్ హనుమకొండ జిల్లాలు ఏర్పడిన సందర్భంగా హనుమకొండ ప్రజల సౌకర్యార్థం ఆర్టిఏ కార్యాలయం హన్మకొండకు తరలించారు. కానీ వరంగల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఇంకా అనుమకొండలోనే కొనసాగుతుంది. దీనివల్ల వరంగల్ జిల్లా యొక్క ప్రజల అసౌకర్యానికి గురవుతున్నారని  వినోద్ కుమార్ పేర్కొన్నారు. భూముల రిజిస్ట్రేషన్ చేయించుకునే వారికి నగదు లావాదేవీలు చేయడానికి రక్షణ లేకుండా పోతుందని తెలిపారు. ఎలాగైతే ఆర్టిఏ ఆఫీసు ఏ జిల్లాకు ఆ జిల్లా ఉన్నట్లే  వరంగల్ జిల్లాకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఆఫీసు వరంగల్ జిల్లాలోని ఏర్పాటు చేయాలని వినోద్ కుమార్ సంబంధిత అధికారులను కోరారు. ఈ సమావేశంలో పలువురు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.