Tuesday, 3 November 2026

మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరణలు.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. జూన్ 2. (జనం సాక్షి). తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఐటీ, మున్సిపల్, భారీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కలెక్టరేట్ లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా అభివృద్ధిపై రూపొందించిన టేబుల్ బుక్ ఆవిష్కరించారు. జిల్లా అభివృద్ధి డాక్యుమెంటరీ వీక్షించారు. శుక్రవారం కలెక్టరేట్ లో నిర్వహించిన కార్యక్రమాల్లో భాగంగా మంత్రి కేటీఆర్ ఏ స్టోరీ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ అనే శీర్షికతో జిల్లా యంత్రాంగం రూపొందించిన కాఫీ టేబుల్ బుక్ ను ఆవిష్కరించారు. వ్యవసాయ శాఖ రూపొందించిన కరపత్రాలను ఆవిష్కరించిన ఆయన రైతులను చైతన్యవంతం చేయడం కోసం ప్రత్యేక చొరవ తీసుకోవాలని అధికారులను కోరారు. జిల్లాలో అభివృద్ధి కోసం కలెక్టర్ అనురాగ జయంతి చేస్తున్న కృషిని అభినందించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ నేలకొండ అరుణ, వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు, తెలంగాణ పవర్ లూం టెక్స్ టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పి అఖిల్ మహాజన్, రైతుబంధు సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య, ఆకునూరి శంకరయ్య, చెస్ చైర్మన్ చిక్కాల రామారావు అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.