గుర్రం యాదగిరి రెడ్డి వర్ధంతి వేడుకలు
మోత్కూరు నవంబర్ 22 జనంసాక్షి : భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మోత్కూరు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మోత్కూర్ కేఆర్ భవన్ లో మంగళవారం తెలంగాణ సాయుధ పోరాట యోధులు కామ్రేడ్ గుర్రం యాదగిరి రెడ్డి మూడవ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు చేనేత కార్మిక సంఘంరాష్ట్ర కార్యదర్శిపాసి కంటి లక్ష్మి నరసయ్య పాల్గొని మాట్లాడుతూ గుర్రం యాదగిరి రెడ్డి చిన్ననాటి నుండే కమ్యూనిస్టు పార్టీకి ఆకర్షితులై తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న వ్యక్తి అని ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి అని మూడు పర్యాలు రామన్నపేట శాసనసభ్యులుగా ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి అని అన్ని పార్టీలకు అందుబాటులో ఉండి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసిన వ్యక్తి అని జిల్లా రైతు సంఘం కార్యదర్శిగా రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షుడిగా పని చేసినారు. ప్రజల మధ్యలో ఉండి ప్రజల నాయకుడిగా గుర్తింపు పొందిన వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మోత్కూరు మండల కార్యదర్శి అన్నపు వెంకట్, పట్టణ కార్యదర్శి పులకరం మల్లేష్,ఏఐటీయూసీ మండల కార్యదర్శి తొంట తిరుపయ్య,పట్టణ సహాయ కార్యదర్శి గొలుసుల యాదగిరి, తాడూరు లక్ష్మీ నరసయ్య, సిపిఐ మండల నాయకులు బోడ సోమ నరసయ్య, కడమంచి వీరస్వామి, గీత పనివారల సంఘం మండల నాయకులు అంబటివెంకటయ్య, ఏఐవైఎఫ్ మండల నాయకులు చిప్పలపల్లి ప్రశాంత్, ఏఐటీయూసీ నాయకులు దండబోయిన మల్లయ్య, మహిళా సంఘం పట్టణ నాయకురాలు కడమంచి జానమ్మ, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.




