Friday, 6 November 2026

గుర్రపుతండ గ్రామపంచాయతి లో వున్న పలు సమస్యలపై

గుర్రపుతండ గ్రామపంచాయతి లో వున్న పలు సమస్యలపై దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ నాయక్ కు వినతి పత్రం అందజేసిన ఎన్ ఎస్ యు ఐ నాయకుడు రామవత్ సేవ నాయక్
కొండమల్లేపల్లి డిసెంబర్ 17 జనం సాక్షి న్యూస్ : కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని గుర్రపు దండ గ్రామపంచాయతీలో పలు అభివృద్ధి పనులు శంకుస్థాపనలకు వచ్చిన దేవరకొండ శాసనసభ్యులు రామావత్ రవీంద్ర కుమార్ నాయక్ ను గుర్రపుతండ గ్రామపంచాయతీలో బస్ స్టాండ్ యొక్క పనులు ప్రారంభించాలని, నూతన అంగన్వాడీ బిల్డింగ్,గ్రామపంచాయతీ భవనం మంజూరు చెయ్యాలని దేవరకొండ శాసనసభ్యులు రమవత్ రవీంద్ర కుమార్ నాయక్ ను కోరడం జరిగింది అని ఎన్ ఎస్ యు ఐ నాయకుడు రమావత్ సేవ నాయక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు