Friday, 6 November 2026

TSUTF జి ల్లా మహా సభలను జయప్రదం చేయండి.

TSUTF జి ల్లా మహా సభలను జయప్రదం చేయండి.

చిలప్ చేడ్/డిసెంబర్/జనంసాక్షి :- తూఫ్రాన్ మండల కేంద్రంలోని శివ శివాని ఫంక్షన్ హాల్లో నేడు ఆదివారం నిర్వహించే TSUTF జిల్లా మహా సభలను జయప్రదం చేయాలని TSUTF చిలప్ చేడ్ మండల అధ్యక్షులు గంగాధర్ రావు అన్నారు. నూతన పెన్షన్ విధానం రద్దు చేయాలని, ఉపాధ్యాయ బదిలీలు, ప్రమోషన్ లకు షెడ్యూల్ విడుదల చేయాలని,317 జీ వో. భాదిత ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని,KGBV ఉపాధ్యాయినీ లకు మూలవేతనం ఇవ్వాలని,KGBV లలో రాత్రి విధులకు కేర్ టేకర్ లను నియమించాలని, ట్రెజరీ లలో ఉన్న పెండింగ్ బిల్లులు వెంటనే మంజూరు చేయాలని అన్నారు.ఉపాధ్యక్షులు వెంకట స్వామి మాట్లాడుతూ వేలాది మంది ఉపాధ్యాయులు సభకు తరలిరావాలని కోరారు.ఈకార్యక్రమంలో చిలప్ చెడ్ ఉన్నత పాఠశాల ప్రధా నోపాధ్యాయులు విఠల్,మండల ఉపాధ్యక్షులు వెంకట స్వామి, ప్రధాన కార్య దర్శి సత్యనారాయణ, కోశాధికారి మోహన్, జిల్లా కార్యవర్గ సభ్యులు రమేశ్ , మండల కార్యదర్శులు , ఆ ది నారాయణ ఉపాధ్యాయులు , నాగ రాణి, రుక్మిణీ, రేణుక తది తరులు పాల్గొన్నారు.