గృహ నిర్భంధ నేతల విడతల వారీగా విడుదల
శ్రీనగర్,అక్టోబర్ 3 (జనంసాక్షి):జమ్మూలో నిర్బంధంలో ఉన్న రాజకీయ నాయకులందరినీ విడతల వారీగా విడుదల చేయనున్నట్లు ఆ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్‌కు సలహాదారు ఫరూక్ ఖాన్ తెలిపారు. జమ్మూకశ్మీర్ బ్లాక్ డెవలప్మెంట్ కౌన్సిల్(బీడీసీ) రెండో విడత ఎన్నికలకు నోటిఫికేషన్ ప్రకటించిన నేపథ్యంలో నిర్బంధంలో ఉన్న నాయకులను ం విడుదల చేస్తున్నారా? అని సలహాదారును అడిగారు. ఈ క్రమంలో ఫరూక్ గవర్నర్ కు బదులిస్తూ.. ‘అవును, ప్రతి ఒక్కరిపై క్షుణ్ణంగా విశ్లేషణలు జరిపి అనంతరం ఒకరి తర్వాత ఒకరిని విడతల వారీగా విడుదల చేస్తాం’ అని తెలిపారు.జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతల దృష్ట్యా అక్కడి రాజకీయ నాయకులను ముందస్తుగా ప్రభుత్వం గృహ నిర్బంధంలో ఉంచింది. దాదాపు 50 రోజులుగా వారు గృహ నిర్బంధంలో ఉంటున్నారు.