కాప్రా జవహర్ నగర్ ( జనం సాక్షి ) ఏప్రిల్ 14 :-. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతంలో ఇండ్ల నిర్మాణాలకు అనుమతులు రద్దు చేసి మంత్రి మల్లారెడ్డి కుట్రపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని ఇందుకు రాబోవు రోజుల్లో తగు మూల్యం చెల్లించక తప్పదని జవహర్ నగర్ స్థానికులు కొడపర్తి సదాచారి ధ్వజమెత్తారు గత ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి జవహర్ నగర్ ప్రాంతాన్ని అభివృద్ధి చెందిన ప్రాంతంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షిస్తూ 300 ఎకరాల 18 గుంటల ప్రాంతంలో ఉన్న ఇండ్లను గ్రామకంఠంగా గుర్తించి గ్రామ కంఠం పరిధిలో ఉన్న నివాసితులందరికీ ఇండ్ల నిర్మాణాల కోసం గ్రామపంచాయతీ అనుమతులు ఇచ్చే సదవకాశాన్ని కల్పించి ప్రజల ఆనందమే తన ఆనందంగా భావించి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తే నేడు మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతంగా ఆవిర్భవించిన జవహర్ నగర్ లో మంత్రి మల్లారెడ్డి కుట్రపూరిత రాజకీయాలకు తెరలేపి పాలకమండలి స్వార్థపూరిత ప్రయోజనాల కోసం పూర్తిస్థాయిలో గృహ నిర్మాణాలకు అనుమతులను రద్దుచేసి ప్రజల స్వేచ్ఛను హరిస్తూ జవహర్ నగర్ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం వెనక ఉన్న మూల కారణాలను ఈరోజు పేదల పెన్నిధి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రాజ్యాంగ నిర్మాత మహనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా జవహర్ నగర్ లో ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో మంత్రి మల్లారెడ్డి జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ గృహ నిర్మాణాలకు అనుమతులు రద్దు చేయడం వల్ల తీవ్ర అసహనానికి గురవుతున్న ప్రజలకు సమాధానం చెప్పాలని కొడపర్తి సదాచారి ప్రజల తరఫున విజ్ఞప్తి చేశారు అభివృద్ధి పేరుతో జవహర్ నగర్ ప్రధాన రహదారి పునర్నిర్మాణానికి నిండు కరోనా సమయంలో భూమి పూజ చేసి సంవత్సరాలు గడిచినా నేటికీ పనులు పూర్తిగాని అస్తవ్యస్తమైన రోడ్డు పై గతంలో ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరిగినప్పటికీ బాధిత ప్రజలు ఎంత ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ పట్టించుకోని మంత్రి మల్లారెడ్డి నేడు రెండు రోజుల క్రితం బాలాజీ నగర్ హైస్కూల్లో విద్యనభ్యసించే విద్యార్థులు ప్రధానంగా రోడ్డు సమస్యే కారణంగా ప్రమాదవశాత్తు కారు కింద పడి ఒక విద్యార్థిని మృతి చెందగా ఇద్దరు విద్యార్థులు తీవ్ర గాయాల పాలు కావడం జరిగింది ఇందుకు బాధ్యత వహించాల్సింది ఎవరు విద్యార్థిని తల్లిదండ్రుల గర్భశోకాన్ని తీర్చాల్సింది ఎవరు అనే విషయాన్ని కూడా మంత్రి మల్లారెడ్డి ఈరోజు జరిగే సభ సమావేశంలో ప్రజలందరీ సమక్షంలో మృతి చెందిన విద్యార్థిని కుటుంబ సభ్యులకు పూర్తి భరోసానివ్వాలని సదాచారి డిమాండ్ చేశారు




