Thursday, 5 November 2026

ట్రెండు మారినా ఫ్రెండ్ మారడు వాత్సల్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ వీడ్కోలు సమావేశం

 

 

 

 

 

భువనగిరి టౌన్ జనం సాక్షి :–ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడు అంటూ వాత్సల్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విద్యార్థులు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం జరుపుకున్నారు.ఈ ఫేర్వెల్ డే మరియు వార్షికోత్సవం లో విద్యార్థిని విద్యార్థులు చాలా  జోష్ గా వేడుకలను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా వాత్సల్య కళాశాల చైర్మన్ శ్రీ దరిపల్లి నవీన్ కుమార్ మరియు ట్రెజరర్ దరిపల్లి ప్రవీణ్ కుమార్ వాత్సల్య కళాశాల ఫౌండర్ స్వర్గీయ శ్రీ దరిపల్లి అనంత రాములు గారి చిత్రపటానికి పూలమాలవేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వీరితో పాటు విశిష్ట అతిథులుగా విచ్చేసినటువంటి యాదాద్రి భువనగిరి జిల్లా ట్రస్మా అధ్యక్షులు డాక్టర్ జలంధర్ రెడ్డి మరియు ట్రస్మ కార్యదర్శి దుర్గాప్రసాద్ మరియు ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసిన ప్రముఖ కవి రచయిత జర్నలిస్ట్ డాక్టర్ తిరునగరి శ్రీనివాస్ , ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడు సినిమా చిత్ర యూనిట్ నుండి ప్రొడ్యూసర్ చంద్రశేఖర్ చిత్ర డైరెక్టర్ లక్ష్మణ్ నటులు శ్రీ చరణ్ , బాహుబలి హార్స్ సప్లయర్ గౌస్ పటేల్, సుబ్బారావు, లోకేష్ నాయక్, డేవిడ్ మొదలగువారు హాజరై ఈ కార్యక్రమానికి విజయవంతం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరించాయి. ఫ్రెండ్ మారిన ట్రెండు మారడు సినిమా నుండి లేటెస్ట్ గా వచ్చిన ఇంతవరకు ఆడియో లాంచ్ అవని ఫ్రెండ్షిప్ సాంగ్ ను వాత్సల్య విద్యార్థులు ఆడుతూ పాడుతూ ఎంతో జోష్ గా ఎంజాయ్ చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి యాదాద్రి భువనగిరి జిల్లా ట్రస్మ అధ్యక్షులు డాక్టర్ జలంధర్ మాట్లాడుతూ విద్యార్థులు మీ తల్లిదండ్రులకు మీ ఊరికి పేరు తీసుకువచ్చి వారి కళ్ళల్లో ఆనందభాష్పాలు చిగురించేలా చేయాలని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ట్రస్మ ఉపాధ్యక్షులు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ వాత్సల్య విద్యార్థులు టెక్నికల్ విభాగంలో మన యాదాద్రి భువనగిరి జిల్లా లో మొదటి స్థానంలో ఉందని వాత్సల్య కళాశాలలో అడ్మిషన్ పొందిన మీ అందరూ అదృష్టవంతులని విద్యార్థుల ఉద్దేశించి మాట్లాడారు. దరిపల్లి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ మా వాత్సల్య కాలేజీ విద్యార్థులకు కోర్సు పూర్తి చేసిన వెంటనే 100% ఉద్యోగాల కల్పనే జేయంగా కృషి చేస్తున్నామని ప్రతి విద్యార్థికి ప్లేస్మెంట్ లో ఉద్యోగం వచ్చే విధంగా తగు చర్యలు తీసుకుంటున్నామని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఖచ్చితంగా లైఫ్ లో సెట్ అవ్వాలని కోరారు. ప్రముఖ కవి తిరునగరి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థి దశ ఎంతో కీలకమైనదని ఈ దశలో పిల్లలు సఫలీకృతులు కావాలని అన్నారు. వాత్సల్య కళాశాల వీడ్కోలు కార్యక్రమంనకు వాత్సల్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపల్ గొల్లపూడి సురేష్  వాత్సల్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపల్ జిలకర వెంకట  సురేష్ ,అసిస్టెంట్ ప్రొఫెసర్లు అర్జున్, లావణ్య, బివి రెడ్డి, రేఖ, నాగ మల్లేష్, శ్రీనివాస్, కళ్యాణ్, నాగేశ్వరరావు, భవాని జ్యోతి, హెచ్ అండ్ ఎస్ డిపార్ట్మెంట్ వెంకటేశ్వర్లు వాత్సల్య నాన్ టెస్టింగ్ స్టాప్ గోపాలకృష్ణ, ఉమా, శంకర్, కేతమ్మ బుచ్చమ్మ, భాగ్యలక్ష్మి, భాగ్య విద్యార్థి విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని వారి యొక్క ఆటపాటలతో రోజంతా ఎంతో సంతోషంగా గడిపారు.