గెలుపే లక్ష్యంగా పొరాటపటిమతో సాధన చేయాలి

శిక్షణ కొరకు కావలసిన సౌకర్యాల కల్పనకు కృషి;
మున్సిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ
మున్సిపల్ చైర్ పర్సన్
కోదాడ టౌన్ నవంబర్ 23 ( జనంసాక్షి )
కోదాడ పురపాలక సంఘం పరిధిలోని బాలాజీనగర్ లో ఉన్నటు వంటి కె ఆర్ ఆర్ డిగ్రీ కళాశాలలో ఎస్సై, కానిస్టేబుళ్ల స్థాయి పోస్టుల శారీరక సామర్థ్య పరీక్షల కోసం  సిద్దమవుతున్న విద్యార్థిని విద్యార్థులను కోదాడ మునిసిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ
కలిసి మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగాల భర్తీలో భాగంగా చేపట్టే ఈవెంట్స్(శారీరక సామర్థ్య పరీక్షల) కి అందరూ కలిసికట్టుగా సాధన చేసి మన కోదాడ పరిధిలో అనేక ఉద్యోగాలు సాధించాలి అని కోరారు.ఈ తరుణంలో అక్కడి విద్యార్థినీ విద్యార్థుల కోరిక మేరకు బాగు
చేయించిన గ్రౌండ్ ను పరిశీలించి,ప్రస్తుతం వారు అడుగుతున్న మంచి నీరు,లాంగ్ జంప్ ట్రాక్,మరియు  లైట్స్ ని త్వరితగతిన ఏర్పాటు చేయిస్తాము అని తెలిపారు.ఈ కార్యక్రమంలో  వార్డ్ కౌన్సిలర్ దరావత్ కైల స్వామినాయక్, శంకర్,రమేష్, తులసిరామ్,రామ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు