Thursday, 5 November 2026

గొల్లపల్లిలో గ్రామసభ

గొల్లపల్లిలో గ్రామసభ.
నెన్నెల, జనవరి 12 (జనంసాక్షి )
నెన్నెల మండలం గొల్లపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో గురువారం సర్పంచ్ ఇందూరి శశికళ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. గ్రామసభలో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక 2023-24 ఆర్థిక సంవత్సరంకు సంబందించిన ప్రత్యేక గ్రామసభ చేపట్టారు. పంచాయతీ అభివృద్ధికి సంబందించిన అంశాలను సమావేశంలో చర్చించి తీర్మాణం చేశారు. ఈసమావేశంలో వార్డు సభ్యులు గంగమల్లు, ప్రమోద్, ఉమాదేవి, వ్యవసాయ విస్తరణ అధికారి సుప్రజ, సింగల్ విండో మాజీ చైర్మన్ ఇందూరి రమేష్, ఏఎన్ఎం చంద్రకళ, ఐకేపీ సిబ్బంది అనిల్, సువర్ణ, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.