Thursday, 5 November 2026

వృద్ధులకు చేయూత అందించడం అభినందనీయం.

వృద్ధులకు చేయూత అందించడం అభినందనీయం.

బిజెపి జిల్లా అధికార ప్రతినిధి చెన్నమనేని కమలాకర్ రావు.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. జనవరి 12.(జనం సాక్షి).

వయోవృద్ధులకు చేయూత అందించడం అభినందనీయమని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి చేన్నమనేని కమలాకర్ రావు అన్నారు. గురువారం సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరులో ఏర్పాటుచేసిన చిట్నేని ఆగమ్మ_నర్సింగరావు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు చిట్నేని వెంకటేశ్వరరావు మాధవి, ప్రదీప్ రావు లు వయోవృద్ధులకు ఉచితంగా దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన బిజెపి జిల్లా అధికార ప్రతినిధి చెన్నమనేని కమలాకర్ రావు మాట్లాడుతూ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం నిరుపేద వయోవృద్ధులకు ఉచితంగా దుప్పట్లు పంపిణీ చేయడాన్ని అభినందించారు. సేవా కార్యక్రమాల ద్వారా దాతృత్వాన్ని చాటుకున్న కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. 8 9 వార్డులోని పలువురు నిరుపేద వృద్ధులకు సుమారు 300 దుప్పట్లు పైగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎనిమిదవ వార్డు కౌన్సిలర్ చేన్నమనేని కీర్తన కమలాకర్ రావు, బాలకృష్ణయ్య, మంగ కిరణ్ ,మహేందర్ తదితరులు పాల్గొన్నారు.