సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి):వినియోగదారుల మన్ననలు పొందినప్పుడే ఏ వ్యాపారమైన అభివృద్ధి చెందుతుందని సూర్యాపేట మున్సిపాలిటీ 44వ వార్డ్ కౌన్సిలర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన మహావీర్ ఫుడ్ కోర్ట్ నందు స్నాక్స్ షాప్ ను ఆయన ప్రారంభించి మాట్లాడారు.రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న సూర్యాపేట వ్యాపార రంగానికి కేంద్ర బిందువుగా మారిందన్నారు.వినియోగదారులకు నాణ్యమైన, రుచికరమైన ఆహార పదార్థాలను అందించి వారి మన్నలను పొందాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ , ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్య యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, పిసిక వీరయ్య , షాప్ నిర్వహకులు ఇరుగు రవి , విజయ్ , దైద వెంకన్న, నరేందర్ , ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.




