Thursday, 5 November 2026

గొల్లపల్లి కాంగ్రెస్ గ్రామ కమిటీ ఎన్నిక

 జనంసాక్షి, కమాన్ పూర్ : ఏఐసీసీ సెక్రెటరీ, మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు కమాన్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు వైనాల రాజు అద్వర్యములో గొల్లపల్లి గ్రామ కాంగ్రెస్ కమిటీ ఆదివారం ఎన్నుకోవడం జరిగింది. గొల్ల పల్లి గ్రామ శాఖ ఆధ్యక్షుడు బత్తుల అంజి, ఉపాధ్యక్షులు కనుకుంట్ల సదయ్య , ప్రధాన కార్యదర్శి చెరగొండ రాజేశం, ప్రచార కమిటి మేకల కుమార్, రైతు కన్వనర్ జరిగి ఓదేలు, బి.సి. సెల్ మేకల శ్రీను, ఆర్గనైజింగ్ సెక్రెటరీ చిగురు శ్రీనివాస్, కార్యదర్శి చలేంద్ర సతీష్ కుమార్, సంయుక్త కార్యదర్శి బత్తుల నర్సయ్య ను నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గొల్లపల్లి గ్రామ సర్పంచ్ షీలారపు అనిత మల్లయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి గాండ్ల మోహన్, జిల్లా కార్యదర్శి సయ్యద్ అన్వర్, కమాన్పూర్ మండలం మాజీ కోఆప్షన్ మెంబర్ అబ్దుల్ రఫిక్, ఎస్సీ సెల్ మండల ప్రెసిడెంట్ మల్యాల తిరుపతి మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి అప్సర్, పెంచికల్పేట్ సీనియర్ నాయకులు చొప్పరి శేఖర్, కమాన్పూర్ గ్రామ శాఖ అధ్యక్షులు కొంతం శ్రీనివాస్, బొజ్జ సతీష్ మామిడి రాజు బుర్ర సత్యం, కమాన్పూర్ మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ నాగపురి అజయ్, యూత్ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.