Thursday, 5 November 2026

వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలి దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ గడల శ్రీనివాసరావు

దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈనెల 14న వైద్య ఆరోగ్య దినోత్సవం ఘనంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గడల శ్రీనివాస రావు గారు పేర్కొన్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో నాలుగు జిల్లాల వైద్య అధికారులు, నోడల్ ఆఫీసర్లు ఇతర సిబ్బందితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిహెచ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రగతిని ప్రజల్లోకి తీసుకెళ్లి సంక్షేమ పథకాల పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖ దినోత్సవాన్ని పురస్కరించుకొని అదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల,నిర్మల్ తదితర నియోజకవర్గంల పరిధిలోని రోగులకు గర్భిణీలకు న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ వేగవంతం చేయాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న మహిళా సిబ్బందికి, ఆశ వర్కర్లకు చీరలను పంపిణీ చేయాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో తీసుకున్న కార్యక్రమాలను విజయవంతం చేయాలని తొమ్మిదేళ్ల పాలనలో ప్రభుత్వం అందించిన సంక్షేమంపై సమీక్ష జరపాలన్నారు. ప్రగతి నివేదికను చదివి వినిపించాలన్నారు. రానున్న సీజనల్ వ్యాధుల పట్ల ముందస్తు జాగ్రత్తలు తీసుకుని వైద్యులు, వైద్య అధికారులు సిబ్బంది తమ ఆసుపత్రి పరిధిలో అందుబాటులో ఉండాలన్నారు. క్షేత్రస్థాయిలో పై నిరంతరం నిరంతర పర్యవేక్షణ నిర్వహించాలని వైద్య అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా వర్షాకాలం వ్యాధులపై ప్రజలు ప్రజలకు అవగాహన కల్పించి పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రతలు, పారిశుద్ధ్యం ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలన్నారు. దోమలు ప్రబలకుండా చూడాలని దోమలతో వచ్చే వ్యాధులపై సర్వేలు చేసి మందులు అందుబాటులో ఉండేలా గట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో మంచిర్యాల
డిఎంహెచ్ఓ సుబ్బారాయుడు, అదిలాబాద్ డిఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్, ఆసిఫాబాద్ డిఎంహెచ్ఓ రామకృష్ణ, నిర్మల్ డిఎంహెచ్ఓ ధనరాజ్ సంబంధిత వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు