.గొల్లపల్లి సర్పంచ్ కు ఉత్తమ అవార్డు.నెన్నెల, మార్చి 25 (జనంసాక్షి) గ్రామపంచాయతీల్లో చేపడుతున్న పనులు, సేవలకుగాను కేంద్రప్రభుత్వం వివిధ విభాగాల్లో ఉత్తమ పురస్కారాలు అందజేసింది. గ్రామపంచాయతీల్లో చేపట్టిన వివిధ పనులు, సేవలపై ఆన్‌లైన్ ద్వారా వివరాలు పంపించగా పోస్టల్ ద్వారా పండిత్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పేరిట పురస్కారాలు ప్రశంసాపత్రాలను పంపించింది. ఈమేరకు శనివారం నాడు మంచిర్యాల కలెక్టరేట్ లో వివిధ గ్రామాల సర్పంచులు, కార్యదర్శులు, ఎంపీటీలు పురస్కారాలను అందుకున్నారు. ఇందులో భాగంగా నెన్నెల మండలం గొల్లపల్లి చెందిన గ్రామ ప్రథమ పౌరురాలు ఇందూరి శశికళ రమేష్ కు జాతీయ ఉత్తమ సర్పంచ్ అవార్డు లభించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గొల్లపల్లి ప్రజల సహకారంతో గ్రామానికి అన్నీ విధాలుగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. గ్రామ ప్రజల సహాయ సహకారాలతో జాతీయ అవార్డుకు ఎంపిక కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈకార్యక్రమంలో కలెక్టర్ సంతోష్, జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, జడ్పీ సీఈఓ నరేందర్, వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, ఎంపీపీ సంతోషం రమాదేవి, జడ్పీటీసీ సింగతి శ్యామల, ఎంపీడీఓ వరలక్ష్మి, ఎంపీవో శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి మద్దివేణి రంజిత్ తదితరులు పాల్గొన్నారు.
గొల్లపల్లి సర్పంచ్ కు ఉత్తమ అవార్డు




