సంపూర్ణ పోషకాహారాలను పై దృష్టి సారించి ఆరోగ్యాలను కాపాడుకుందాం- కిషన్ పరివార్ సంస్థ సిఎస్ఓ అచ్యుతరావు -గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేతడోర్నకల్ మార్చి/ 25/ జనం సాక్షి న్యూస్: మహబూబాబాద్ జిల్లాడోర్నకల్ మండల కేంద్రంలోని స్థానిక బ్రిలియంట్ హైస్కూల్ ఆవరణలో కిసాన్ పరివార్ సంస్థ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా స్కూల్ కరస్పాండెంట్ వి అప్పారావు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆరోగ్యం మరియు పోషకాహారం పై విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులను ఆహ్వానించి అవగాహన కల్పించి ఆటల పోటీలను నిర్వహించారు. మంచి ఆహారం ఉన్నచోటే మంచి ఆరోగ్యం కూడా ఉంటుందని కిసాన్ పరివార్ సంస్థ సీ.యస్.ఓ అచ్యుతరావు అన్నారు. ముఖ్యంగా మహిళల ఆరోగ్యం పట్ల తీసుకునే ఆహారం ముఖ్య భూమిక పోషిస్తుందని నడుస్తున్న ఇప్పటి యాంత్రిక జీవనంలో ఆరోగ్యం, ఆహారంపై దృష్టి పెట్టకపోవడంతో 40 ఏళ్ల వయస్సుకే ఎన్నో రకాల అనారోగ్య రుగ్మతలతో బాధపడుతూ హాస్పటల్లో చుట్టూ తిరుగుతున్నామని అన్నారు.మనమంతా సంపూర్ణ పోషకాహారాలను పై దృష్టి సారించి ఆరోగ్యాలను కాపాడుకునే దిశగా ప్రయత్నాలు చేయాలని కోరారు.ఈ సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ ఆప్సర్ బేగం మరియు మహిళా సిబ్బంది అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సంపూర్ణ పోషకాహారాలను పై దృష్టి సారించి ఆరోగ్యాలను కాపాడుకుందాం




