గోడ పత్రిక ఆవిష్కరణ
మిర్యాలగూడ, జనం సాక్షి
తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో ఈనెల 8,9,10 తేదీల్లో హైదరాబాద్ నగరంలో జరుగనున్న ద్వితీయ మహాసభల గోడ పత్రిక (పోస్టర్), ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ 10వ ప్లీనరీ పోస్టర్ ను మిర్యాలగూడ పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆ సంఘం జర్నలిస్టు సభ్యులతో కలిసి శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు గురువారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ అస్లాం, నాగిరెడ్డి, అన్నెబోయిన మట్టయ్య, బొంగారాల మట్టయ్య, సీనియర్ జర్నలిస్టులు లక్ష్మణ్, సుమన్, దర్శనపు శ్రీనివాస్, కృష్ణ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
గోడ పత్రిక ఆవిష్కరణ




