రియల్ ఎస్టేట్ కోసమే పవర్ ప్లాంట్ మూసివేతకు కుట్రలు….
వంతపాడితున్న
*కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు…..
*శాలివాన పవర్ ప్లాంట్ ను తెరిపించాలి…..
*కార్మికులకు పని భద్రత కల్పించాలి….
సంకే రవి సిపిఎం జిల్లా కార్యదర్శి డిమాండ్…..
మంచిర్యాల జిల్లా కేంద్ర సమీపంలో ఉన్న శాలివాహన పవర్ ప్లాంట్ కార్మికులు గత మూడు నెలలుగా తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, పెండింగ్లో ఉన్న మూడు సం.రాల బోనస్ మూడు నెలల వేతనాలు ఇవ్వాలని, పరిశ్రమకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించాలని కోరుతూ ఆందోళన చేయడం జరుగుతుంది.
పోరాటంలో భాగంగా ఈరోజు కార్మికులు పవర్ ప్లాంట్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేస్తున్న శిబిరాన్ని సిపిఎం బృందం సందర్శించి వారి పోరాటానికి మద్దతు తెలపడం జరిగింది.
శాలివాన పవర్ ప్లాంట్ ఏర్పాటు సందర్భంగా
ఈ ప్రాంతంలో రైతుల వద్ద తక్కువ ధరకు భూములు కొనుగోలుచేసి నేడు ఆ భూముల విలువ పెరగడంతో పవర్ ప్లాంట్ మూసేసి వెంచర్లు పెట్టి రియల్ ఎస్టేట్ ద్వారా కోట్లు గడించాలని యాజమాన్యం కుట్రలు చేస్తుంది.ఈ కుట్రలకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు లోపకారిగా మద్దతు తెలుపుతుంది.
ఈ పద్ధతిని విరమించుకోవాలని సిపిఎం మంచిర్యాల జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది.
సం.రానికి రెండు కోట్ల ఉద్యోగాలని చెప్పిన బిజెపి, మోడీ.ఇంటికొక ఉద్యోగం అని చెప్పిన BRS,కేసిఆర్ ప్రభుత్వాలు శాలివాహన పవర్ ప్లాంట్ కు కావలసిన అనుమతులు ఇవ్వకుండా పరిశ్రమ మూత వేయాలని చూస్తున్న యాజమాన్యాలకు అనుకూలంగా వ్యవరిస్తున్నాయి. ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని ఆసరాగా చేసుకుని పవర్ ప్లాంట్ యాజమాన్యం ప్లాంటును మూసేసి కార్మికుల పొట్టలుకొట్టి,తమ ఆధీనంలో ఉన్న భూములను రియల్ ఎస్టేట్ చేసి కోట్లు గడించాలని చూస్తున్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే పరిశ్రమ తెరిపించుటకు తగు చర్యలు తీసుకోవాలని, జిల్లా అధికార యంత్రాంగం జోక్యం చేసుకోవాలని, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని,
సిపిఎం మంచిర్యాల జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది. ఒకవేళ పరిశ్రమను తెరిపించకుండా కార్మికులను వీధుల పాలు చేస్తే,పరిశ్రమ ఏర్పాటు కోసం తీసుకున్న భూములను,ఉపాధి కోల్పోయిన కార్మికులకు, భూమి,ఇంటి స్థలాలు లేని కార్మికులకు,పేదలకు సిపిఎం ఆధ్వర్యంలో పంచడం జరుగుతుందని తెలియజేస్తున్నాం.
ఈ కార్యక్రమంలో
సంకే రవి సిపిఎం జిల్లా కార్యదర్శి
దాసరి రాజేశ్వరి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు,దూలం శ్రీనివాస్ సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు,పట్టణ నాయకులు ప్రేమ్ కుమార్,.మహేందర్




