హుజూర్ నగర్ ఫిబ్రవరి 7 (జనంసాక్షి): హుజూర్ నగర్ పరిధిలోని ఫణిగిరి గట్టుపై శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణోత్సవం సందర్భంగా మంగళవారం శ్రీ చక్రస్నానం జన రంజకంగా జరిగింది. పల్లకిలో చక్ర ఇరుమాళ్ళను పెంచేసి గట్టు చుట్టు ప్రదక్షణ గావించారు. అనంతరం మహా మండపంలో అధిష్టింపజేసి యాగ్నిక స్వామి పంచసూక్తలతో అభిషేకించారు. తులసిమాలలతో అలంకరించారు. నీరాజనం మంత్ర పుష్ప తీర్థ ప్రసాదాలు భక్తులకు అందించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా గట్టుపై కళావేదిక మీద సప్తస్వర శ్రీనివాస భజన మండలి వారి సాంప్రదాయ కీర్తనలు భక్తులను విశేషంగా ఆకర్షించాయి. భద్రయ్య చారి, కంబాల శ్రీనివాస్ లక్ష్మీనారాయణ ఆలపించిన మధుర గీతాలు భక్తులను రంజింప చేశాయి. కీబోర్డ్ ఈశ్వర చారి, తబలా దామోదరా చార్యులు, ప్యాడ్స్ వెంకటరామయ్య లు అలరింపజేశారు. రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు దొంతగాని సత్యనారాయణ నిర్వహించిన డాన్స్ బేబీ డాన్స్ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. నాటు నాటు పాట, దిగు దిగు దిగు నాగ మొదలగు పాటలు ప్రేక్షకులతో ఈలలు వేయించాయి. ఈ కార్యక్రమంలో దేవాలయ ఈ.వో గుజ్జుల కొండారెడ్డి, భక్తులు, స్థానాచార్యులు, అర్చకులు, దేవాలయ అభివృద్ధి సమితి సభ్యులు, మహిళలు విశేషంగా పాల్గొన్నారు.




