బిచ్కుంద జూన్ 02 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలంలో గల గోపన్పల్లి గ్రామంలో శుక్రవారం నాడు తెలంగాణ అవతరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా జాతీయ జెండాను సర్పంచ్ శ్రీనివాస్ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక త్యాగాల ఫలితంగా స్వరాష్ట్రం సాధించగలిగామని, ప్రత్యేక గ్రామ పంచాయతీల వల్ల అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు జరుగుతోందని హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ ఉప సర్పంచ్ నాగప్ప, వార్డ్ సభ్యులు, పంచాయతీ కార్యదర్శి పద్మ, డైరెక్టర్ శివరాజ్, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాములు, స్కూల్ హెచ్ఎం, అంగన్వాడి సిస్టర్ లక్ష్మి, ఆశ వర్కర్ అనిత మరియు గ్రామ పెద్దలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
గోపన్పల్లి గ్రామంలో ఘనంగా రాష్ట్రావతరణ దినోత్సవం




