Tuesday, 3 November 2026

పంచాయతీ ఆవరణలో ఘనంగా రాష్ట్రావతరణ దినోత్సవం

బిచ్కుంద జూన్ 02 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని
మద్నూర్ మండలకేంద్రంలో గల గ్రామపంచాయతీ ఆవరణలో శుక్రవారం నాడు తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్బంగా జాతీయ జెండాను మద్నూర్ సర్పంచ్ డి సూర్యకాంత్ ఆవిష్కరించడం జరిగింది మరియు అమరవీరుల స్తూపంకు నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక త్యాగాల ఫలితంగా స్వరాష్ట్రం సాధించగలిగామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ విట్టల్, ఎంపీవో, సెక్రటరీ సందీప్ కుమార్, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు మరియు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.