గోపాల మిత్రుల సాంకేతిక శిక్షణ సదస్సు
వైరా జనవరి 7న జనం సాక్షి
వైరా పట్టణంలో పశుగణాభివృద్ధి సంస్థ ప్రాంగణంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గోపాల మిత్రలకు డాక్టర్ కె.కిషోర్ గారు(అసిస్టెంట్ డైరెక్టర్),కొర్లగుంట్ల నాగేశ్వరావు గారి(చైర్మన్) అధ్యక్షతన జరిగిన జాతీయ కృత్రిమ గర్భాధారణ -ఆధునిక సాంకేతిక నిపుణుల సదస్సు కు స్థానిక వైరా శాసనసభ్యులు గౌరవ శ్రీ లావుడియా రాములు నాయక్ మరియు ఖమ్మం పార్లమెంట్ సభ్యులు గౌరవ శ్రీ నామా నాగేశ్వరరావు గార్ల తో కలిసి మన తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు గౌరవ శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారు ముఖ్యఅతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం 260 మందికి , 20 మంది పశుమిత్రాలను ,20 మంది మైత్రి మిత్ర లనుఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చేరుకున్నారని, వారికి కనీస వేతనం 11500 వచ్చే విధంగా ముఖ్యమంత్రివర్యులు ద్రోహదం చేశారని ,అందుకు గోపాల మిత్రలందరు ఆయా ప్రాంతాలలోని రైతులకు ,గ్రామాలలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని ,సాంకేతికతను సామాన్య రైతుల వరకు చేర్చి పాడి పరిశ్రమ అభివృద్ధికి ,ఈ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని అందుకు గోపాల మిత్రలందరు నిరంతరం కృషి చేయాలని తెలియజేశారు. ఈ రాష్ట్రంలో రోజురోజుకీ అంతరించిపోతున్న పశుపోషణను పెంచి మునుపటి గ్రామ స్వరాజ్యం సాధించాలని అందుకు గోపాలమిత్రలు సిద్ధంగా ఉండి ఎల్లవేళలా ప్రజలకు సేవ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా డాక్టర్ వేణు మనోహర్ (జెడి),కొత్తగూడెం డాక్టర్ పురందేశ్వర్ (జెడి)మరియు ఎంపీడీవో గారు పాల్గొన్నారువారితోపాటు రాష్ట్ర మార్క్ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్ ,మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, జిల్లా రైతు సమన్వయ సమితి కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ ముళ్లపాటి సీతారాములు ,మార్కెట్ చైర్మన్ బీడీకే రత్నం ,మాజీ ఎమ్మెల్యే చంద్రావతి, నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ కోసూరు శ్రీనివాసరావు, ఎంపీపీ వేల్పుల పావని ,జెడ్పిటిసి నంబూరి కనకదుర్గ, కో ఆప్షన్ సభ్యులు షేక్ లాల్ మహమ్మద్, జిల్లా దిశ కమిటీ సభ్యులు కట్టా కృష్ణార్జున రావు, పట్టణ అధ్యక్షులు దార్ణ రాజశేఖర్, రూరల్ అధ్యక్షులు బాణాల వెంకటేశ్వరరావు, కౌన్సిలర్ వనమా విశ్వేశ్వరరావు,సోషల్ మీడియా కన్వీనర్ మోటపోతుల సురేష్, కో ఆప్షన్ సభ్యులు షేక్ బీబాసాహెబ్, డి ఎల్ డి ఏ అధికారులు, మీరు కూడా రాజు, తడికమళ్ళ నాగేశ్వరరావు, రూరల్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ నరేష్,గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.
గోపాల మిత్రుల సాంకేతిక శిక్షణ సదస్సు




