గోపీనాథ్ సేవలు మరువలేని
బోడుప్పల్ అభివృద్ధిలో ఆయన భాగస్వామ్యం ఎంతో విలువైనది
..
నివాళుర్పించిన కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు పోగుల నరసింహ రెడ్డి
మేడిపల్లి – జనంసాక్షి
బోడుప్పల్ అభివృద్ధిలో మాజీ ఉప సర్పంచ్ బొమ్మక్ గొపీనాథ్ సేవలు మరువలేనివని కాంగ్రెస్ పార్టీ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు, కార్పొరేటర్ పోగుల నరసింహ రెడ్డి కొనియాడారు. మంగళవారం గోపీనాథ్ ఐదవ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం నరసింహ రెడ్డి మాట్లాడుతూ.. బోడుప్పల్ గ్రామ ఉప సర్పంచ్ గా గోపీనాథ్ అహర్నిశలు కృషి చేశారని అన్నారు. నిత్యం గ్రామాభివృద్ధికి తోడ్పడుతూనే సేవా కార్యక్రమాలు నిర్వహించే వారన్నారు. చిన్న వయసులోనే ఆయన మృతిచెందడం గ్రామానికి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని అన్నారు. ఆయన మార్గంలోనే నేడు ఆయన కుమారుడు కళ్యాణ్ కుమార్ ప్రజాప్రతినిధిగా సేవలందిస్తుండడం అభినందనీయం అన్నారు. బోడుప్పల్ నగర ఎస్సీ సెల్ అధ్యక్షుడు కందుకూరి నవీన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వర్ధంతి కార్యక్రమంలో కార్పొరేటర్లు తోటకూర అజయ్ యాదవ్, బొమ్మకు కళ్యాణ్ కుమార్, మాజీ ఉప సర్పంచ్ ఎలగోని బాల్ రాజు గౌడ్, మాజీ వార్డ్ సభ్యులు బొమ్మకు రమేష్, మాజీ సహకార బ్యాంకు డైరెక్టర్ బొమ్మకు విశ్వనాథ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పొన్నం తరుణ్ గౌడ్, ఫకీర్, హారి నాథ్ రెడ్డి, దిలీప్ రెడ్డి, సింగిరెడ్డి రాజి రెడ్డి, చీరాల జంగయ్య, టీఆర్ఎస్ పార్టీ నాయకులు గోపు రాములు, ఎండీ అఫ్జల్ తదితరులు పాల్గొన్నారు.