గోస్కొండ గ్రామ వివిధ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరికలు …..

యాదాద్రి భువనగిరి (జనం సాక్షి):–
పోచంపల్లి మండలం గోసుకొండ గ్రామం నుంచి భువనగిరి నియోజకవర్గం ఇంచార్జి పంజాల రామాంజనేయులు గౌడ్ అధ్వర్యంలో 100 మంది కాంగ్రెస్ పార్టీ లో చేరిక కావటం జరిగింది . ఈ సందర్భంగా రామాంజనేయులు గౌడ్ మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలలో బిఆర్ఎస్ చేసింది ఏమీ లేదని ప్రజలను రాష్ట్రానికి లక్షల కోట్ల అప్పులు చేసినారు రాష్ట్రంలో పెరుగుతున్న నిత్యవసరాలు పెట్రోల్ డీజిల్ ప్రజల మీద మోపుతున్నాడని అన్నారు సామాన్యుడు ధరలు విపరీతంగా పెంచి రెక్కాడితే డొక్కాడని పేద ప్రజలు బతకలేని స్థితిలో ఉన్నారని అన్నారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన అనగన వర్గాల న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ తోటి సాధ్యమని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి ఇల్లు కట్టుకునేకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు రాజీవ్ గృహకల్ప ప్రజలు లబ్ధి పొందినారు అని అన్నారు.