Monday, 2 November 2026

గౌడ జన హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడిగా బాల గౌడ్

వెల్దుర్తి ఆగష్టు 31 (జనం సాక్షి) తెలంగాణ గౌడ జన హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడిగా బాల గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు చేగుంట లో జరిగిన జిల్లా రెండో మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా గౌడ కుల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తానని ఆయన తెలిపారు జిల్లాలో బెల్టుషాపులు విపరీతంగా పెరిగిపోయాయని వాటిని వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు త్వరలో గౌడ కుల సమస్యలపై కార్యాచరణ రూపొందిస్తామని ఆయన తెలిపారు అలాగే జిల్లా గౌడ జన హక్కుల పోరాట సమితి కార్యవర్గాన్ని త్వరలోనే నియమిస్తామని ఆయన తెలిపారు.