గౌహతి ఘటన నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు
అసోం, జూలై 14 (జనంసాక్షి) : అసోంలోని గౌహతిలో ఒక బార్ ముందు అందరూ చూస్తుండగానే ఒక బాలిక దుస్తులు చించివేసి లైంగికంగా వేధించిన ఘటనలో నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఈ గాలింపులో 13 మంది ప్రమేయం ఉన్నట్టు పోలీసులు తెలియజేస్తుండగా, నలుగురిని మాత్రమే అరెస్టు చేశారు. కాగా ముఖ్యమంత్రి తరుణ్ గోగాయ్ ఈ ఘటనపై విచారణకు ఆదేశిస్తూ 15 రోజుల్లో నివేదికను సమర్పించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.