ఖమ్మం : గ్యాస్ ధరల పెంపునకు వ్యతిరేకంగా ఖమ్మం ధర్నా చౌక్‌లో బీఆర్‌ఎస్ శ్రేణులు పెద్దఎత్తున ధర్నా నిర్వహించాయి. మంత్రి పువ్వాడ అజయ్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు నల్లజెండాలు, ఖాళీ సిలిండర్లతో నిరసన వ్యక్తంచేశారు. కట్టెల మోపులు నెత్తినపెట్టుకుని మహిళలు ధర్నాలో పాల్గొన్నారు.రాష్ట్ర రాజధానిలో కూడా ఆందోళనలు మిన్నంటాయి. హైదరాబాద్ ఫిలింనగర్ చౌరస్తాలో నిర్వహించిన ధర్నాలో ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. ధర్నాలో మహిళలు భారీగా పాల్గొన్నారు. గ్యాస్ ధరలు తగ్గించాలని కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
గ్యాస్ ధరల పెంపుపై బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో మిన్నంటిన నిరసనలు




