Tuesday, 3 November 2026

డబల్ బెడ్ రూమ్ ఇండ్ల జాబితాలో : పేదలను విస్మరించారు.. అన్హరులకు అవకాశం పై కాంగ్రెస్ ఆందోళన 

మిర్యాలగూడ. జనం సాక్షి నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలోని 48 వార్డులలో డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ(“డ్రా”నిర్వహించే) జాబితా లో అర్హులైన నిజమైన పేదలకు విస్మరించి… అన్హరులకు జాబితాలో పేర్లు ఉన్నాయని ఆరోపిస్తూ మిర్యాలగూడ మున్సిపాలిటీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్డిఓ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమం చేపట్టి ధర్నా చేశారు. పేదలకు అన్యాయం జరగకుండా వారి పేర్లను కూడా  “డ్రా” జాబితాలో చేర్చాలని వారు డిమాండ్ చేశారు.  పేదలకు న్యాయం చేయాలని ఆర్డిఓ చెన్నయ్య కు విన్నవించుకున్నారు. ఈ ఆందోళన కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు కొమ్ము శ్రీనివాస్, రవి నాయక్, ముదిరెడ్డి నర్సిరెడ్డి,  శేఖర్ రెడ్డి, జానీ, నాయకులు సలీం, అబ్దుల్లా, మోహీజ్, తమ్మడ బోయిన అర్జున్, వెంకటేష్ గౌడ్, పట్టణంలోని వివిధ వార్డుల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.