గ్యాస్ సరఫరా నిలిపివేత
ఢిల్లీ: మహారాష్ట్రలోని రత్నగిరికి కేటాయించిన గ్యాస్ సరఫరాను నిలిపివేయాలని కేంద్ర పెట్రోలియం శాఖకు పీఏం కార్యాలయం ఆదేశాలు జారీచేసింది. రత్నగిరికి కేటాయించిన 2 ఎంఎంఎస్ సీఎండీ గ్యాస్‌ను ఏపీకి సరఫరా చేయాలని కూడా ప్రధాని కార్యాలయం ఆదేశాలు జరీ చేసినట్లు సమాచారం. ఆదేశాలు నిలుపుదల చేశామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డికి ప్రధాని కార్యాలయం ఫోనులో తెలిపింది.