ఉత్తర్‌ప్రదేశ్: గ్యాస్ సిలిండర్ పేలి ఆరుగురు దుర్మరణం పాలైన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిజనూర్ ప్రాంతానికి చెందిన యమీన్(75) ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో అతనితో పాటు మరో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల్లో రెండేళ్ల చిన్నారి ఉన్నట్లు గుర్తించారు. పేలుడు ధాటికి ఇంటి గోడలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇంట్లో సిలిండర్‌తో పాటు పేలుడు పదార్థాలు ఉండటం వల్లే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.