రాజన్న సిరిసిల్ల బ్యూరో. మార్చ్ 2 (జనం సాక్షి). గ్యాస్ ధరలకు కేంద్ర ప్రభుత్వ తీరు నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తా వద్ద గురువారం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కమిటీ సభ్యులు పంతం రవి మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్తులను ఆదానికి దోచిపెడుతూ ప్రజలపై భారం మోపుతున్న మోడీ సర్కార్ తీరును తీవ్రంగా తప్పు పట్టారు. ఇప్పటికే పేద మధ్యతరగతి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ పరిస్థితిలో ప్రజలకు ఊరట కలిగించాల్సింది పోయి గ్యాస్ ధరలను మరోసారి పెంచి ప్రారంభం తప్పు పట్టారు. తక్షణమే పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో నాయకులు కడారి రాములు, మంత్రి చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.
గ్యాస్ ధరలకు ఆగ్రహం. సిపిఐ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం.




