బిచ్కుంద మార్చి 2 (జనంసాక్షి)
ముస్లింలు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు ప్రైవేటు ఫంక్షన్ హాలులో చేసుకోవాలంటే వేలల్లో డబ్బు ఖర్చవుతుంది. డబ్బున్న వారు ఎంత డబ్బైనా వెచ్చించి ఫంక్షన్ చేసుకుంటారు. కానీ పేద, మధ్య తరగతి ముస్లింలు తమ ఇండ్ల వద్దే ఇరుకిరుకు స్థలంలోనే పండుగలు చేసుకుంటారు. వారి ఇబ్బందులు తీర్చేందుకే ప్రభుత్వం షాదీఖానాల నిర్మాణాలు చేపట్టింది. చాలా చోట్ల అవి ముస్లింలకు అందుబాటులోకి వచ్చాయి కూడా. దీంతో ఇబ్బందులు లేకుండా ముస్లింలు తమ శుభకార్యాలు చేసుకుంటున్నారు. మండల కేంద్రంలోని ఒక ఎకరం స్థలము గతంలో అరుణ తార ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 10 లక్షల రూపాయల వ్యయంతో తెలుగుదేశం హయాంలో నిర్మించారు. ప్రస్తుతం కోఆప్షన్ మౌనం వహించడం చర్చనీయాంశంగా మారింది. షాదీఖానాలో అసంపూర్తిగా ఉన్న పనులను త్వరలో పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని స్థానిక ముస్లింలు కోరుతున్నారు. ప్రయివేటు హాళ్ల ఖర్చులు తగ్గుతాయని అంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పనులు చేస్తున్న తరుణంలో స్థానిక ఎమ్మెల్యేతో పాటు మైనార్టీ కార్పొరేషన్ జిల్లా అధికారులు కూడా పట్టించుకుని పూర్తి చేయించాలని జనం కోరుతున్నారు.
నిరుపయోగంగా షాదిఖానానిరుపయోగంగా షాదిఖానామైనార్టీలకు ఉపయోగపడని భవనంమండల కోఆప్షన్ మౌనం?




