కమాన్ పూర్, జనం సాక్షి : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి వంట గ్యాస్ ధరలను పెంచుతూ పోవడాన్నీ నిరశిస్తూ.. గురువారం కమాన్ పూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద బీ. ఆర్. ఎస్ మండల మహిళ విభాగం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా వంట గ్యాస్ సిలెండర్ ప్రక్కన పడేసి కట్టెల పొయ్యి మీద వంట చేస్తూ.. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేఖ నిర్ణయాలను వ్యతిరేకహిస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్బంగా బీ. ఆర్. ఎస్ శ్రేణులు మాట్లాడుతూ.. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు పలు మార్లు వంట గ్యాస్ ధరలను పెంచి సామాన్యులపై మోయలేని భారాన్ని మోపుతుందాన్నారు. ఇప్పటికైనా పెంచిన ధరలను తగ్గించి సామాన్య పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చూడాలని కోరారు. లేని యెడల బీ. ఆర్. ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చెప్పాడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో..బీ. ఆర్. ఎస్ మండల అధ్యక్షురాలు పొన్నం రాజేశ్వరి, స్థానిక సర్పంచ్ నీలం సరిత, మహిళ ప్రజాప్రతినిధులు ఇటవేన కొమురమ్మ, గుర్రం కవిత, కొలిపాక లక్ష్మి,అసినా, బీ. ఆర్. ఎస్ మండల అధ్యక్షులు పిన్ రెడ్డి కిషన్ రెడ్డి, ఏ. ఎం. సీ వైస్ చైర్మన్ గుర్రం లక్ష్మీముల్లు, సర్పంచ్ లు తాటికొండ శంకర్, కొండ వెంకటేష్, ఎంపిటిసి కోలేటి చంద్రశేఖర్, మండల పరిషత్ కో అప్సన్ సభ్యులు ఎం. డి ఇంటియాజ్, నాయకులు గోడిసేల సంపత్, అబ్బీడి సంతోష్ రెడ్డి, మేకల సంపత్ యాదవ్, గడప కృష్ణమూర్తి, బొమ్మగాని అనిల్ గౌడ్, పంతకాని రవి, ఎద్దు రాజయ్య, ఎలాబోయిన రామ్మూర్తి,ఆకుల గట్టయ్య, గోడిసేలా లింగస్వామి, ముకీద్, మట్ట నర్సయ్య, పొల్లు శంకర్, జంగపెల్లి లక్ష్మణ్, కుందారపు సత్యం, ఎం. డి అమీర్, కమ్మగోని అనిల్ గౌడ్, బొజ్జ రాజసాగర్, అనవేన వేణు, ఇరుగురాల వెంకటి, దేవునూరి చంద్రమౌళి, సవాయి శంకర్, దాసరి రాంచంద్రం, నీలం శ్రీనివాస్, ఇటవేనా కొమురయ్య, చొప్పరి శ్రీనివాస్, తోట వీరయ్య, నామని రాయాలింగు, చిప్పకూర్తి శ్రీనివాస్, ఎం. తిరుపతి లతో పాటు తదితరులు పాల్గొన్నారు.
వంట గ్యాస్ ధరలు తగ్గించాలి – కమాన్ పూర్ లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన..!




