మృతుని కుటుంబ సభ్యులకు పరామర్శ,ఆర్థిక సాయం అందజేత.
కోటగిరి జనవరి 4 జనం సాక్షి:- కోటగిరి మండలం జల్లాపల్లి ఫారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సోమ్లా నాయక్ ఇటీవల మరణించారు.ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎంపీటీసీ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఎలమంచిలి శ్రీనివాస రావు వారి స్వ గృహానికి వచ్చి వారి చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను బుధవారం రోజున పరామర్శించి 5 వేల రూపాయలు ఆర్ధిక సహాయాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో కోటగిరి ఎంపిటిసి కొట్టం మనోహర్, మాజీ ఎంపీపీ గంగాధర్ దేశాయ్, మాజీ ఎంపీటీసీ రాములు,మాజీ సర్పంచ్ వలి,మాజీ సర్పంచ్ పీర్యా నాయక్,మాజీ డిసిసి కార్యదర్శి గంగాప్రసాద్,ఫకీరా,శంకర్,మియా, యశ్వంత్,సాయిలు,మోహినుద్దిన్,ప్రదీప్,తదితరులు పాల్గొన్నారు.




